జీడిమెట్ల, వెలుగు : భర్తతో కలిసి ట్రాన్స్ జెండర్ సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. శివనగర్‌కు చెందిన అనిల్ అలియాస్ అనూష (25) కూలి పనిచేసేది. అదే ఏరియాకు చెందిన గణేశ్(25) ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. వీరిద్దరూ రెండేండ్ల కిందట పెండ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి తరచూ గొడవ పడేవారు.
సోమవారం మరోసారి గొడవపడ్డ అనూష, గణేశ్.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. జగద్గిరిగుట్ట పోలీసులు డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.