కామారెడ్డి జిల్లాలో విషాదం.. డెంగ్యూతో యువతి మృతి

కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ ఓ యువతి మృతిచెందింది. సదాశివనగర్ మండలం కుప్రీయాల్ గ్రామానికి చెందిన రాగిణి (18) అనే యువతి ఐదు రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో ఆమెను చికిత్స కోసం కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు.

అయితే.. డెంగ్యూ వ్యాధికి చికిత్స పొందుతూ ఇవాళ (సెప్టెంబర్ 30న) మృతిచెందింది. యువతి మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు.