పిల్లల దత్తత విషయంలో గొడవ.. క్షణికావేశంలో భార్యను చంపిన భర్త

హైదరాబాద్ : సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పిల్లలను దత్తత తీసుకునే విషయంలో తలెత్తిన గొడవ కారణంగా భార్యను చంపేశాడో భర్త. క్షణికావేశంలో కేబుల్ వైర్ తో భార్య గొంతు నులిమి హత్య చేశాడు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 

బీహార్ రాష్ట్రానికి చెందిన బీనా, లక్ష్మణ్ దంపతులకు 29 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బోయిన్ పల్లిలోని ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పిల్లలను దత్తత తీసుకునే విషయంలోనూ మంగళవారం (జూన్ 20న) గొడవ జరిగింది. ఇద్దరు మధ్య మాటా మాటా పెరగడంతో కోపంతో భార్య బీనా మెడకు కేబుల్ వైర్ బిగించి.. గొంతు నులిమాడు. ఊపిరి ఆడక ఆమె స్పాట్ లోనే చనిపోయింది.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బోయిన్ పల్లి పోలీసులు.. నిందితుడు లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.