వనస్థలిపురంలో దారుణం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

హైదరాబాద్​ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న భార్యను అడ్డగించి బండరాయితో కొట్టి హత్య చేశాడో భర్త. ఈ ఘటన విజయపురి కాలనీ ఫేస్1లో జరిగింది. 

అసలేం జరిగింది..?

వనస్థలిపురం శాతవాహన నగర్ కు చెందిన బాల కోటయ్య, శాలిని దంపతులకు ఇద్దరు కుమారులు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ (అక్టోబర్ 6న) సాయంత్రం తన సోదరి ఇంటికి శాలిని స్కూటీపై వెళ్తుండగా భర్త బాల కోటయ్య వెంబడించాడు. బైక్ పై నుండి కింద పడేసి.. అనంతరం ఆమె తలపై బండ రాయితో కొట్టి హత్య చేశాడు. భార్యను చంపిన తర్వాత నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.