హైదరాబాద్: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పన్నెండేళ్ల కార్తికేయ GHMC స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందాడు. సోమవారం ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుతుండగా.. బాల్ సిమ్మింగ్ ఫూల్ లో పడింది. నిన్న సిమ్మింగ్ ఫూల్ బంద్ ఉండటంతో గోడ ఎక్కి దూకి బాల్ కోసం వెళ్లినట్లు కార్తికేయ ఫ్రెండ్స్ చెబుతున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. సనత్ నగర్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేస్తున్నారు.