తాటి చెట్టుకు ఉరేసుకున్న గౌడన్న.. కారణమిదే

సూర్యాపేట జిల్లా : పిల్లలు లేరు, భార్య మతిస్థిమితం లేదు. ఆదుకుంటామని, ధైర్యం చెప్పి భరోసా ఇవ్వలేదు దగ్గరి వారు.. ఇనాళ్లు జీవితాన్ని లాగి లాగి అలిసిపోయాడు. దీంతో బతుకు మీద ఆశ చచ్చింది ఆ గౌడన్నకు. జీవితంపై విరక్తి చెందిన ఓ గౌడన్న ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. 

సూర్యాపేట జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం (80) తాటి చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు.

గీతకార్మికుడిగా ఉన్న వెంకటేశం భార్య మతిస్మితం కోల్పోయింది. పెద్ద వయస్సులో ఇంటిపని, భార్యకు సేవలు చేయడం, కళ్ళు గీయడంలో అలసిపోయి మానసికంగా కుంగిపోయాడు వెంకటేశం. దీంతో ఆత్మహత్యకు పాల్పడడ్డాడు.