హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. హబ్సిగూడలోని రూపాలి అపార్ట్ మెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మృతులను ప్రతాప్ (34), సింధూర (32), ఆద్య(4), ప్రతాప్ తల్లిగా గుర్తించారు. సింధూర హిమాయత్ నగర్ లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వహిస్తుండగా.. ప్రతాప్ బీఎండబ్ల్యూ కారు షోరూమ్ లో మేనేజర్ గా విధులు పని చేస్తున్నాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.