కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజూరాబాద్ లోని జాతీయ రహదారి పనుల కోసం మొరం మట్టితో అతివేగంగా వస్తున్న టిప్పర్ లారీ అటుగా బైక్ పై వస్తున్న వారిపై బోల్తా పడింది. దీంతో స్పాట్ లోనే బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లిలో జరుగుతున్న పెద్దమ్మ జాతరకి వెళ్లారు విజయ్, వర్ష, సింధూజ అనే ముగ్గురు.
జాతర ముగించుకుని అర్థరాత్రి 1 గంటకు బయల్దేరి ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ వద్దకు రాగానే జాతీయ రహదారికి పనుల నిమిత్తం మొరం మట్టితో ఓ టిప్పర్ లారీ అతి వేగంగా వచ్చి ఆ ముగ్గురు ప్రయాణిస్తున్న బైకు పై పడింది. దీంతో ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందారు. వీరిలో విజయ్, వర్ష ఇద్దరు అన్నా చెల్లెల్లు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు యాక్సిడెంట్ స్పాట్ కు చేరుకుని డెడ్ బాడీలను రికవరీ చేసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. డ