రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం బావుసాయిపేటలో విషాదం చోటు చేసుకుంది.. గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో బోర్ మోటార్ పైపులు దించే క్రమంలో నలుగురు కూలీలకు విద్యుత్ షాక్ తగిలింది. విద్యుదాఘాతానికి గురైన భూమయ్య అనే కూలీ అక్కడి క్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలు కర్నల శ్రీనివాస్, కర్నల మహేష్, పంబల రాజు లకు తీవ్రగాయాలైయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్ లో వేములవాడ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ALSO READ :- Allu Arjun: వైజాగ్లో పుష్పరాజ్ మాస్ ఎంట్రీ.. భారీగా వచ్చిన అభిమానులు
విషయం తెలుసుకున్న వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏరియా హాస్పిటల్ కి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన భూమయ్య కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆది శ్రీనివాస్ డాక్టర్ లను ఆదేశించామన్నారు.