పది నిమిషాలైతే ఇంటికి.. అంతలోనే విషాదం

పది నిమిషాలైతే ఇంటికి.. అంతలోనే విషాదం
  • అతివేగంతో బస్సును ఢీకొట్టిన ఆటో
  • కూతురికి బియ్యం తీసుకువస్తున్న తండ్రి మృత్యువాత

బోథ్, వెలుగు: అతివేగానికి ఓ నిండు ప్రాణం బలైంది. వేగంగా వెళ్లిన ఓ ఆటో బస్సును ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం బోథ్​ మండలంలో జరిగింది. నిర్మల్​ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన ఏనుగు లక్ష్మారెడ్డి(55) బోథ్​ మండలం ధన్నూర్​‘బి’ గ్రామంలో ఉండే తన కూతురు మార లావణ్య రెడ్డి కోసం తన పొలంలో పండించిన 5 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని తీసుకొని ఆటోలో వస్తున్నాడు.

మండలంలోని కుచులాపూర్ వెంకటేశ్వర ఆలయ సమీపంలో బోథ్​నుంచి ఆదిలాబాద్​ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వీరి ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో లక్ష్మారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్​ గంజేవార్​ వసంత కృష్ణ తీవ్ర గాయాలయ్యాయి. అతడిని నిర్మల్​లోని ఓ ప్రైవేట్​ఆస్పత్రికి తరలించారు.10 నిమిషాలైతే తన తండ్రి ఇంటికి వచ్చేవాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కూతరు లావణ్య, కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి అల్లుడు మార జైపాల్​ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.ప్రవీణ్​కుమార్​ తెలిపారు.