హైదరాబాద్ కేపీహెచ్బీ థర్డ్ ఫేజ్లో విషాదం.. మూడేళ్ల పిల్లాడి గురించైనా ఆలోచించాల్సింది..

హైదరాబాద్ కేపీహెచ్బీ థర్డ్ ఫేజ్లో విషాదం.. మూడేళ్ల పిల్లాడి గురించైనా ఆలోచించాల్సింది..

హైదరాబాద్: కట్టుకున్న వాడే వరకట్నం కోసం కసాయిలాగా మారి హింసించాడు. దీంతో.. సౌజన్య అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పరిధిలోని మూడవ ఫేజ్లో జరిగింది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన రజనీకాంత్ రెడ్డికి వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలోని ఖానాపూరానికి చెందిన సౌజన్య(29)తో 2020లో వివాహమైంది. వీరికి ప్రస్తుతం మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. పెళ్లైనప్పటి నుంచి వరకట్నం కోసం భర్త, అత్త తరచూ వేధిస్తుండడంతో ఆత్మహత్యకు పాల్పడింది.

ఘటనపై కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. సౌజన్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన ప్రకారంగా బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.