
వరంగల్: ఖిలా వరంగల్లో విషాద ఘటన జరిగింది. అర్ధ రాత్రి గొర్రెల షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎటూ వెళ్ళలేక 300 గొర్రెలు సజీవ దహనమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. షార్ట్ సర్క్యూటా, ఎవరైనా కావాలని తగలబెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కుక్కల దాడిలో ఇరువై ఐదు గొర్రెలు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూర్లో ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. గ్రామానికి చెందిన జోగు అశోక్ ఇంటి వద్ద ఉన్న దొడ్డిలో గొర్రెల మంద ఉంచగా, తెల్లవారు జామున కుక్కలు దాడిచేసి 25 గొర్రెలను చంపేయగా, మరో ఐదు గొర్రెలకు తీవ్రగాయాలయ్యాయి. వీటి విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.