జగిత్యాల జిల్లాలో విషాదం.. తెల్లవారితే పెళ్లి.. పెళ్ళికొడుకు ఎందుకిలా చేశాడో..!

జగిత్యాల జిల్లాలో విషాదం.. తెల్లవారితే పెళ్లి.. పెళ్ళికొడుకు ఎందుకిలా చేశాడో..!

జగిత్యాల జిల్లా: మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో పెళ్లి ఇంట్లో విషాదం జరిగింది. తెల్లవారితే పెళ్లి అనగా రాత్రి ఉరి వేసుకుని పెళ్ళికొడుకు కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లింట్లో చావు, అది కూడా పెళ్లి కొడుకు చనిపోవడంతో ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లోని బాలానగర్ పరిధిలో కూడా ఈ తరహా ఘటనే జరిగింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

పెళ్లయిన నెల రోజులకే గంట విజయ గౌరి అనే 20 ఏళ్ల యువతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయన తర్వాత కూడా ఆమె చదువు కొనసాగించింది. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఫిబ్రవరి 6న ఈశ్వర రావుతో  వివాహమైంది. విజయ గౌరి స్వస్థలం విజయనగరం జిల్లా. నిన్న రాత్రి(శుక్రవారం) బాల్ రెడ్డి నగర్లో ఈ ఘటన జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.