
గోదావరిఖని, వెలుగు: రామగుండం రైల్వే స్టేషన్లో గురువారం సింగరేణి ప్యాసింజర్ రన్నింగ్ట్రైన్దిగుతూ వరుణ్ కుమార్(30) మృతి చెందాడు. యూపీకి చెందిన వరుణ్ కుమార్ రైల్వే స్టేషన్‌లోని క్యాంటీన్లో పని చేస్తూ ట్రైన్లలో వాటర్అమ్ముతుంటాడు. కాగా గురువారం కూడా రైలులో వాటర్ అమ్ముతుండగా.. కదలడంతో దిగడానికి ప్రయత్నించి జారీ ట్రైన్ కింద పడడంతో శరీరం రెండు ముక్కలైంది. రామగుండం రైల్వే జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.