రంగారెడ్డి జిల్లాలో ఈ హోం గార్డు.. గుండెపోటుతో చనిపోయిండు.. హార్ట్ అటాక్కు ముందు ఏం జరిగిందంటే..

రంగారెడ్డి జిల్లాలో ఈ హోం గార్డు.. గుండెపోటుతో చనిపోయిండు.. హార్ట్ అటాక్కు ముందు ఏం జరిగిందంటే..

యాచారం: గుండె పోటుతో హోం గార్డు మృతి చెందాడు. రంగా రెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్కు చెందిన రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంబర్ పేట్ హెడ్ క్వార్టర్స్లో హోం గార్డుగా విధులు నిర్వహించే వెంకటేష్(35), ఇంటి ప్రక్కన ఉన్న వారితో స్థల వివాదం నెలకొనడంతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. అనంతరం వెంకటేష్(35) యాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకులాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే ప్రాణం పోయింది. ఈ మధ్య గుండె పోట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. 

వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణం విడిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది గుండెపోటుతో చనిపోయారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు కూడా హార్ట్ ఎటాక్తో సడెన్గా మరణిస్తున్నారు. అప్పటివరకు ఎంతో హెల్తీగా ఉన్న వారు ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు.

►ALSO READ | తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

ఏం జరిగిందో తెలుసుకునేలోపు గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. గతంలో 50 ఏళ్లు దాటిన‌వారిలో ఎక్కువ‌గా గుండెపోటు మ‌ర‌ణాలు చూసేవాళ్లం. క‌రోనా త‌ర్వాత చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. హృద్రోగ సంబంధిత సమస్యల కుటుంబ చరిత్ర కలిగిన వారికి ఈ ముప్పు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.