
- గోదావరికి హారతి ఇస్తుండగా ఘటన
బాసర, వెలుగు: బాసర పుణ్యక్షేత్రంలోని వేద భారతి పీఠం పాఠశాలలో శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది గోదావరి నది తీరాన శుక్రవారం ఉదయం హారతి ఇస్తుండగా విద్యార్థి మణికంఠ (17) విద్యుత్ షాక్ తో గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు, తోటి విద్యార్థులు వెంటనే 108కు సమాచారం అందించారు.
వైద్య సిబ్బంది వచ్చి మణికంఠను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానిక ఎస్ఐ గణేశ్ వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. వరంగల్ కు చెందిన రాజేందర్ కొడుకు మణికంఠ మూడేండ్లుగా వేద పాఠశాలలో చదువుతున్నాడని పోలీసులు తెలిపారు.