విషాదం..అర్ధరాత్రి దాకా పెండ్లిరోజు వేడుకలు..అందరూ వెళ్లాక..

విషాదం..అర్ధరాత్రి దాకా పెండ్లిరోజు వేడుకలు..అందరూ వెళ్లాక..
  • మహారాష్ట్రలో ఉరేసుకున్న దంపతులు

ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్‌‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పెండ్లి రోజే దంపతులు సూసైడ్ చేసుకున్నారు. జెరిల్ డామ్సన్ ఆస్కార్ మోన్‌‌క్రిఫ్ (57), భార్య అన్నీ(46) దంపతులు మార్టిన్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. 

26వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా బంధుమిత్రులతో కలిసి కేక్‌‌ను కట్ చేసి, అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున తమ పెండ్లినాటి దుస్తువుల్లోనే శవాలై కనిపించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. మ్యారేజ్ యానివర్సరీ పార్టీలో దంపతులు చాలా ఆనందంగా కనిపించారని, నవ్వుతూ ఎంజాయ్‌‌ చేశారని బంధువులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. 

ముందుగా భార్యను ఉరివేసుకోమని చెప్పిన జెరిల్‌‌.. ఆమె చనిపోయిన తర్వాత డెడ్ బాడీని బెడ్ పై పెట్టి పూలతో అందంగా డెకరేట్ చేశాడన్నారు. అనంతరం అతడు కూడా వంటగదిలో ఉరివేసుకుని ప్రాణాలొదిలాడని చెప్పారు.  

జెరిల్‌‌.. చెఫ్‌‌గా పని చేసేవాడని, దంపతులకు పిల్లలు ఎవరూ లేరని వివరించారు. వారిద్దరూ సూసైడ్ కు ముందు సోషల్ మీడియాలో ఒక స్టేటస్‌‌ను కూడా అప్‌‌డేట్ చేశారన్నారు. ఒకదానిపై స్టాంప్ పేపర్, మరొకదానిపై అనధికారిక వీలునామాతో సహా రెండు సూసైడ్ నోట్‌‌లను అప్‌‌లోడ్ చేశారని వివరించారు. 

తమ మరణానికి ఎవరూ బాధ్యులు కారని, తమ ఆస్తులను సరిగా పంపిణీ చేయాలని దంపతులు తమ సూసైడ్ నోట్‌‌లలో కోరినట్లు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా అనిపిస్తోందని, ఇప్పటివరకు ఎలాంటి కుట్ర కోణం ఉన్నట్టుగా అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌‌కు పంపినట్లు పేర్కొన్నారు.