ఇటీవల కాలంలో ఫ్రీ రీచార్జ్ అంటూ మొబైల్ ఫొన్లకు కొన్ని మేసేజ్ వస్తున్నాయి. మేం పంపించిన మేసేజ్ ను క్లిక్ చేయడం.. మీ మొబైల్ నెట్ వర్క్ ఏదైనా సరే ఫ్రీ రీచార్జ్ పొందండి అంటూ ట్రాయ్ పేరుతో మేసేజ్ లు వస్తున్నాయి. ఈ మేసేజ్ లపై ట్రాయ్ క్లారిటీ ఇచ్చింది.. ఆ మేసేజ్ లు ట్రాయ్ పంపించలేదు.. ఇలాంటి మేసే జ్ లను నమ్మి మోసం పోవద్దు.. అలాంటి మేసేజ్ లను ఓపెన్ చేయొద్దంటూ టెలికమ్ నెట్ వర్క్ యూజర్లను ట్రాయ్ హెచ్చరిస్తోంది.
బుధవారం (జనవరి 1, 2025) టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియ (TRAI) దేశంలో అన్ని టెలికం నెట్ వర్క్ సంస్థల యూజర్లకు వార్నింగ్ నోటీస్ ను జారీ చేసింది. దీని ప్రకారం.. ఫ్రీ రీచార్జ్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల కాలంలో స్కామర్లు తప్పుడు మేసేజ్ లను కస్టమర్లకు పంపించడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ట్రాయ్ పేరుతో వస్తున్న ఇలాంటి ఆఫర్ మేసేజ్ లు ఫ్రాడ్ మేసేజ్ లు వీటిని స్కామర్లు పంపిస్తున్నారు.. ఇలాంటి మేసేజ్ లపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఏవైనా రీచార్జ్ ఆఫర్లను కస్టమర్లకు నేరుగా టెలికం కంపెనీలనుంచి అందుతాయి. మేసేజ్ ల ద్వారా ఆయా టెలికం నెట్ వర్క్ కంపెనీలు పంపిస్తాయి. ఈ ఆఫర్లను ఆయా టెలికం కంపెనీల వెబ్ సైట్ లో చూసుకోవాలని తెలిపింది.
ఫ్రాడ్ స్టర్లు తప్పుడు మొబైల్ రీచార్జ్ ప్లాన్లతో కస్టమర్లను తప్పుదారి పట్టిస్తున్నారు. వాటిని క్లిక్ చేస్తే.. మీ డివైజ్ హ్యాక్ అవుతుంది. దీంతో మీ మొబైల్ లోని డేటాతో పాటు, మీ బ్యాంకు ఖాతాల వివరాలవంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా దొంగిలించబడుతుందని హెచ్చరించింది.
TRAI ఎలాంటి ఆఫర్లను అందించడం లేదు. ఏదైనా టారిఫ్ లకు సంబందించిన ఆయా టెలికం ప్రొవైడర్లనుంచి మాత్రమే పొందగలరని ట్రాయ్ స్పష్టం చేసింది. మీరు ఈ మేసేజ్ లను క్లిక్ చేయకూడదు. అలా చేస్తే డివైజ్ లకు మాల్వేర్ అటాక్ కాగలదు. వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంది.
ఇలాంటి మేసేజ్ లు వస్తే..
యూజర్లు ఇలాంటి మేసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ట్రాయ్ సూచిస్తోంది. మేసేజ్ లు గానీ, కాల్స్ గానీవస్తే వెంటనే సైబర్ క్రైం వెబ్ సైట్ https://Cybercrime. gov.in సంచారా సాధీ పోర్టల్ https://sancharsaathi.gov.in లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలి. నిజానికి ఇలాంటి ఫ్రాడ్ మేసేజ్ లపై ట్రాయ్ దృష్టి సారించింది.. ఇప్పటికే దాదాపు లక్ష మేసేజ్ లను తొలగించింది.
మరోవైపు ట్రాయ్ యూపీఎ యూజర్లకు శుభవార్త చెప్పింది.. ఇకపై UPI పేమెంట్స్ వాట్సాప్ ద్వారా కూడా చేసుకోవచ్చని తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ ఇండియా (NPCI) WhatsApp Pay కోసం కొత్త కస్టమర్ల సంఖ్యపై లిమిట్స్ ను ఎత్తివేసింది. ఇది దేశవ్యాప్తంగా కస్టమర్లందరికి వాట్పాప్ ద్వారా పేమెంట్స్ సర్వీస్ కు పర్మిషన్ ఇచ్చింది.