హమ్మయ్య.. స్పామ్ కాల్స్ చికాకుపై ట్రాయ్ కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్ చేస్తున్న అన్​రిజిస్టర్డ్​ టెలిమార్కెటీర్లను డిస్‌‌కనెక్ట్ చేయాలని ట్రాయ్​ మంగళవారం టెల్కోలను ఆదేశించింది. రెండు సంవత్సరాలపాటు బ్లాక్​ చేయాలని స్పష్టం చేసింది. టెల్కోలు తన తాజా ఆదేశాన్ని తక్షణమే పాటించవలసిందిగా కోరింది. పదిహేను రోజులకు ఒకసారి ఈ విషయంలో తీసుకున్న చర్యలపై రెగ్యులర్ అప్‌‌డేట్‌‌లను సమర్పించాలని కోరింది.

ఈ నిర్ణయం వల్ల స్పామ్​కాల్స్​ బెడద బాగా తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలిపింది. ముందుగా రికార్డ్ చేసిన లేదా కంప్యూటర్ జనరేట్ చేసిన లేదా బల్క్ కనెక్షన్​ కాల్స్​ను అనుమతించవద్దని ఆదేశించింది.