స్పామ్ కాల్స్ కట్టడికి ట్రాయ్ చర్యలు: టెలి కంపెనీలకు కీలక ఆదేశాలు

స్పామ్ కాల్స్ కట్టడికి ట్రాయ్ చర్యలు: టెలి కంపెనీలకు కీలక ఆదేశాలు

ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజేస్ ఒకటి. ఫోన్లు వాడుతోన్న వారిలో మెజార్టీ యూజర్స్ ఈ సమస్యను ఫేస్ చేస్తోన్నారు.  గుర్తు తెలియని నెంబర్లు నుండి వచ్చే కాల్స్, మెసేజ్‎ల వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్పామ్ కాల్స్, మెసేజేస్ కట్టడికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రంగంలోకి దిగింది. ఈ మేరకు టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

 స్పామ్ కాల్స్, మెసేజ్‎ల కట్టడి చర్యలు తీసుకోవాలని అన్ని సర్వీస్ ప్రొవెడర్లకు ఆదేశాలు పంపిన ట్రాయ్.. కీలక సూచనలు చేసింది. ట్రాయ్‎లో రిజిస్టర్ కానీ టెలిమార్కెట్ సంస్థల నుండి వచ్చే ప్రమోషనల్ కాల్స్, రికార్డ్ కాల్స్, కంప్యూటర్ ఆధారిత స్పామ్ కాల్స్‎ను తక్షణమే నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు స్పష్టం చేసింది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ 2018 చట్టం ప్రకారం టెలికాం కంపెనీలకు ట్రాయ్ తాజా ఆదేశాలు జారీ చేసింది.

ట్రాయ్ ఆదేశాలు:

ఎస్ఐపీ (సెషన్ ఇనిషియేషన్ ప్రోటోకాల్) పీఆర్ఐ (ప్రైమరీ రేట్ ఇంటర్‌ఫేస్) వంటి టెలికాం వనరులను ఉపయోగించి ట్రాయ్‎లో నమోదు చేయని టెలిమార్కెటర్‌ల నుండి వచ్చే వాయిస్ ప్రమోషనల్ కాల్‌లను అన్ని యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు తక్షణమే ఆపివేయాలని ట్రాయ్ తాజా ఆదేశాల్లో పేర్కొంది. నేరస్థులను డిస్‌కనెక్ట్ చేసి బ్లాక్‌లిస్ట్ చేయడం: రిజస్టర్ కానీ కంపెనీల నుండి వచ్చే స్పామ్ కాల్స్ పై వినియోగదారులు ఫిర్యాదు చేస్తే వెంటనే ఆరిజినేటింగ్ యాక్సెస్ ప్రొవైడర్ స్పామ్ కాల్స్, మెసేజ్లు చేసిన వారి అన్ని టెలికాం వనరులను 2 సంవత్సరాల వరకు డిస్‌కనెక్ట్ చేయాలి. 

ALSO READ | హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 32 శాతం పెరిగిన ఇండ్ల ధరలు

దీంతో పాటుగా స్పామ్ కాల్స్ చేసిన మార్కెటింగ్ కంపెనీలను అన్ని యాక్సెస్ ప్రొవైడర్లచే బ్లాక్ లిస్ట్ చేయబడతాయి. ప్రొవైడర్ల మధ్య సమాచార భాగస్వామ్యం: బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీ వివరాలను 24 గంటలలోపు డీఎల్టీ ప్లాట్‌ఫారమ్ ద్వారా అన్ని యాక్సెస్ ప్రొవైడర్‌లకు సమాచారం షేర్ చేయబడుతుంది. తద్వారా నిబంధనలు ఉల్లఘించిన బ్లాక్ లిస్ట్ లో పెట్టబడిన కంపెనీలకే ఏ యాక్సెస్ ప్రొవైడర్ ద్వారా టెలికాం వనరులు కేటాయించొద్దని ట్రాయ్ ఆదేశించింది.