- SIM పోర్టబిలిటీపై TRAI కొత్త నిబంధనలు
ఇటీవల కాలంలో ఫోన్ నెంబర్ల పోర్టబిలిటీ పెరిగిపోయింది. పోర్టబిలిటీ అంటే సిమ్ కార్డు మార్పిడితో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అదే నెంబరుతో మారడం లేదా సిమ్ కార్డు పోయినా.. డ్యామేజ్ అయినా కొత్త సిమ్ కార్డు తీసుకోవడం. అయితే దీనివల్ల మోసాలు పెరిగిపోతున్నాయని ఫోర్టబిలిటీ మోసాలకు చెక్ పెట్టేందుకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) నిబంధనలకు సంబంధించి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) వచ్చిన ఫిర్యాదులతో ట్రాయ్ కొన్ని సెక్యూరిటి పరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు ఏంటో.. ఎలా SIM స్వాప్ మోసాలకు ఎలా చెక్ పెడుతుందో తెలుసుకుందాం..
ఫోన్ నంబర్ పోర్టబిలిటీ వల్ల హ్యాకర్ల నుంచి ముప్పు
మీ సిమ్ను క్లోన్ చేయడం ద్వారా హ్యాకర్ SIM స్వాప్ మోసానికి పాల్పడవచ్చు. బ్యాంకు లావాదేవీలు, అకౌంట్ల నుంచి డబ్బులు కాజేయడం వంటి మోసాలు జరగొచ్చు. ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదులు రావడంతో ట్రాయ్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
TRAI కొత్త MNP నిబంధనలు
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAi) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం సవరించిన రూల్స్ జూలై 1నుంచి అమలులోకి వస్తాయి. భారత్ లో ఎక్కువగా ఉన్న SIM స్వాప్ మోసాలకు కొత్త నిబంధనలు చెక్ పెట్టనున్నాయి. చోరీ, లేదా డ్యామేజ్ కారణంగా కొత్త SIM కార్డును కొనుగోలు చేసినవారు ఏడు రోజుల లోపు కొత్త SIM కి పోర్ట్ చేయలేరు. కొత్త సిమ్ తీసుకున్న తర్వాత ఏడు రోజుల గడువు లోపు టెలికాం ఆపరేటర్లు యూనిక్ పోర్టింగ్కోడ్ ని జారీ చేయకుండా నిషేధించడం ద్వారా TRAI కఠినమైన భద్రతా చర్యలను ప్రవేశపెట్టింది.