పాత యాప్‌కు కొత్త సొగసులు.. AI ఫీచర్లతో DND యాప్ అప్‌డేట్ వర్షన్‌

పాత యాప్‌కు కొత్త సొగసులు.. AI ఫీచర్లతో DND యాప్ అప్‌డేట్ వర్షన్‌

స్పామ్ కాల్స్‌తో విసిగిపోతున్న వినియోగదారులకు శుభవార్త అందుతోంది. ఫేక్ కాల్స్ సమస్యను నియంత్రిచడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. డోంట్ డిస్టర్బ్ (DND) యాప్ అప్‌డేట్ వెర్షన్‌ను త్వరలో ప్రారంభించనుంది. అప్‌డేట్ చేయబడిన యాప్ మరో 2 నెలల్లో అందుబాటులోకి రానుందని నివేదికలు వెల్లడించాయి.

పాత యాప్‌కు AI ఫీచర్లు!

ట్రాయ్ 2016లో DND యాప్ ను తెచ్చింది. అయితే, ఈ యాప్ సమర్థవంతంగా పనిచేయకపోవడంతో వినియోగదారుల ఆదరణకు నోచుకోలేకపోయింది. ఈ యాప్ వల్ల ట్రాయ్ ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. అనంతరం SMS స్పామ్ డిటెక్షన్ ఇంజిన్ వంటి కొన్ని అప్‌డేట్లు చేసినప్పటికీ, వినియోగదారులు దానిని అసమర్థంగా భావించారు. ట్రాయ్ ఆ సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. DND యాప్‌లో కొత్త AI ఫీచర్లను జోడించడానికి అవసరమైన సాధ్యాసాధ్యాలను అంచనా వేయమని ట్రాయ్.. టెలికాం కంపెనీలను కోరింది. వారిచ్చిన సలహాలను మూల్యాంకనం చేసి వచ్చే ఏడాది కొత్త యాప్‌ను అందుబాటులోకి తేనుంది.

ALSO READ | Lava Blaze Duo: ఇరువైపులా డిస్‌ప్లేతో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. ధర రూ. 18,000లోపే

ప్రతిరోజూ 27 కోట్ల మంది వినియోగదారులు స్పామ్ కాల్స్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఫేక్ కాల్స్‌పై ఈ ఏడాది ప్రథమార్థంలో ట్రాయ్ కి 7.9 లక్షలకు పైగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.