బిగ్ న్యూస్ : ఇండియాలో 2.75 లక్షల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసిన ట్రాయ్

బిగ్ న్యూస్ : ఇండియాలో 2.75 లక్షల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసిన ట్రాయ్

ఫేక్ కాల్స్..ఇప్పుడు ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. రోజంతా ఏదో రూపంలో స్పామ్ కాల్స్ వస్తూనే ఉంటాయి.ఫేక్ కాల్స్ ద్వారా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫేక్ కాల్స్ అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) దృష్టి సారించింది.  

ఫేక్ కాల్స్, మేసేజ్ ల వంటి సైబర్ క్రైం లను ఎదుర్కొనేందుకు లక్షల్లో మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది ట్రాయ్.వీటితోపాటు అనేక మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్లను కూడా బ్లాక్ చేశారు. 

రిజిస్టర్ కానీ టెలిమార్కెటర్లు నకిలీ కాల్స్ , మేసేజ్ కోసం ఉపయోగించే 2లక్షల 7వేల మొబైల్ నంబర్లను గుర్తించి TRAI  బ్లాక్ చేసింది. పెరుగుతున్న ఫేక్ టెలిమా ర్కెటింగ్ సమస్య గురించి ట్రాయ్ .. యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరిస్తూనే వస్తుంది. ఈ మొబైల్ నంబర్లతో పాటు  మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్లను కూడా బ్లాక్ లిస్ట్ చేసింది. 

అక్టోబర్ 1 నుండి ట్రాయ్ కొత్త నిబంధనలు 

అక్టోబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలు అమలు చేయనుంది. కొత్త నిబంధనల ప్రకారం వైట్ లిస్ట్ అనుమతి లేకుండా టెలి మార్కెటర్లు URL లు  లేదా లింక్  మేసేజ్ లను కస్టమర్లకు పంపకుండా నిషేధిస్తుంది.  టెలిమార్కెటింగ్ ఛానల్ దుర్వినియోగం కాకుండా.. ఈ చర్యలు చేపడుతుంది. 

2024లో గణనీయంగా స్పామ్ కాల్స్

2024 మొదటి ఆరు నెలల్లో స్పామ్ కాల్స్ భారీగా పెరిగినట్టు ట్రాయ్ తెలిపింది. జనవరి నుంచి జూన్  మధ్య కాలంలో అన్ రిజిస్టర్డ్ టెలిమార్కెటర్లపై 7.9 లక్షల పైగా ఫిర్యాదులు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 13,2024  న  అన్ని యాక్సెస్ ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. PRI, SIP లేదా ఇతర టెలికాం ఉపయోగించు కుంటున్న అన్ రిజిస్టర్డ్ సంస్థల నుంచి ప్రచార వాయిస్ కాల్స్ లను తక్షణమే నిలిపివేయాలని సూచించింది.