- పాలనాపరంగానే కేటాయింపులు
న్యూఢిల్లీ: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ కోసం స్పెక్ట్రమ్‌ను వేలం వేయమని, పాలనాపరంగానే కేటాయిస్తామని కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాధిత్య సింధియా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేటాయింపులు ఉచితం కాదని, ట్రాయ్ ధరను నిర్ణయిస్తుందని వెల్లడించారు. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కోరుతున్న విషయం తెలిసిందే.
ప్రతీ దేశం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ) ని ఫాలో కావాల్సిందేనని, శాటిలైట్ లేదా స్పేస్ స్పెక్ట్రమ్‌ను అసైన్‌మెంట్ విధానంలో కేటాయించాలని క్లియర్‌గా ఐటీయూ చెబుతోందని సింధియా వివరించారు. ఇతర ఏ దేశం కూడా శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయడం లేదని చెప్పారు. ప్రభుత్వం కేటాయింపులు జరపడాన్ని మస్క్ స్టార్‌లింక్, అమెజాన్ కైపెర్ సపోర్ట్ చేస్తున్నాయి. ఎయిర్‌టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ మాత్రం ఇటువంటి కేటాయింపులను బిడ్డింగ్ పద్ధతిలో జరపాలని కోరుతున్నారు.