వెన్నెల కిషోర్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. వైజాగ్ బీచ్‌లో జరిగే వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతుంది. కేసును ఛేదించలేని పోలీసులు.. ప్రైవేట్ క్రియేటివ్ డిటెక్టివ్ (వెన్నెల కిషోర్)ను నియమిస్తారు. తను ఆ గ్రామంలోని ప్రేమజంటతో సహా ఏడుగురు అనుమానితులను గుర్తిస్తాడు.
. హ్యుమర్ బిహేవియర్‌తో కేసును పరిష్కరించడంలో అతని పద్దతి, తెలివితేటలు ఆకట్టుకునేలా ఉంటాయి. రవితేజ మహదాస్యం, అనన్య నాగళ్ల ప్రేమ జంటగా నటించగా, శియా గౌతమ్ పోలీస్ కానిస్టేబుల్‌గా కీలక పాత్రలో కనిపించింది. బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, భద్రం ఇతర పాత్రలు పోషించారు. రైటర్ మోహన్ ఎంగేజింగ్, సస్పెన్స్‌గా ట్రైలర్ కట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానుంది. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.