దేవ్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ .. అహో విక్రమార్క మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

దేవ్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘అహో విక్రమార్క’.  త్రికోటి దర్శకుడు.  బుధవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  ఓ ప్రాంతాన్ని తన అదుపులో పెట్టుకుంటాడు అసుర అనే విలన్. అక్కడ అతను చెప్పిందే శాసనం. తనని  ఎదిరించడానికి ఎవరు సాహసించరు.  అలాంటి ప్రాంతానికి పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దేవ్‌‌‌‌‌‌‌‌ గిల్ వస్తాడు. ఆ విలన్‌‌‌‌‌‌‌‌ను అతను ఎలా అంతం చేశాడు అనేది మిగతా కథ.

మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని మరియు అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా చూపించాం’ అని హీరో దేవ్ గిల్ ఈ సందర్భంగా చెప్పాడు. భాష, సంస్కృతి, వీరత్వం, త్యాగం లాంటి అంశాలతో తెరకెక్కించామని,  సరికొత్త దేవ్ గిల్‌‌‌‌‌‌‌‌ను ఇందులో చూస్తారని దర్శకుడు త్రికోటి చెప్పారు. అక్టోబర్ 30న  పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.