
సప్తగిరి హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకుడు. కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించారు. దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. మార్చి 21న సినిమా విడుదల కానుండగా గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫారిన్‌లో జాబ్ చేస్తున్న ప్రసాద్.. ఏజ్ బార్ అవుతోంది పెళ్లెప్పుడు అని గగ్గోలు పెడుతుంటే.. వయసుతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా పెరుగుతోంది ఎక్కువ కట్నం డిమాండ్ చేయొచ్చు అంటాడు అతని తండ్రి.
మరోవైపు పెళ్లి అనే సాకుతో తమ ఫ్యామిలీ మొత్తాన్ని ఫారిన్‌కు షిప్ట్ చేసే పెళ్లికొడుకు కోసం ఎదురుచూస్తుంటుంది హీరోయిన్ ఫ్యామిలీ. వీళ్లిద్దరి జోడీ ఎలా కుదిరింది.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలే మిగతా కథ. ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటించగా, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, వడ్లమాని శ్రీనివాస్, అన్నపూర్ణ, రోహిణి ఇతర పాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.