Shubham Trailer Released : ఇంట్రస్ట్‌గా శుభం మూవీ ట్రైలర్‌

Shubham Trailer Released :  ఇంట్రస్ట్‌గా శుభం మూవీ ట్రైలర్‌

హీరోయిన్‌‌‌‌‌‌‌‌ సమంత నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘శుభం’.  త్రలాలా మూవింగ్ పిక్చర్స్‌‌‌‌‌‌‌‌ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిన ఆమె.. ఫస్ట్ మూవీగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘చచ్చినా చూడాల్సిందే’ అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌తో  రూపొందిస్తున్నారు.  ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దీనికి దర్శకుడు.  వసంత్ మరిగంటి కథను అందించాడు. ఇప్పటికే విడులైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఆదివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  భర్తలు, తమ  భార్యలను ఎలా కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో పెట్టుకోవాలి అనే డిస్కషన్‌‌‌‌‌‌‌‌తో  ట్రైలర్ మొదలైంది. కట్ చేస్తే.. ఊళ్లో మహిళలంతా సీరియల్స్‌‌‌‌‌‌‌‌కు బానిసగా మారి భర్తలను చిత్రహింసలు పెడతారు

. టీవీ ఆఫ్ చేస్తే.. ‘సీరియల్ ఆగకూడదు’ అంటూ దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తిస్తుంటారు.  వారి నుంచి తప్పించుకునేందుకు ఊళ్లో పురుషులంతా కూడా అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి తరుణంలో మాతాజీగా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన సమంత సినిమాపై మరింత ఇంటరెస్ట్ క్రియేట్ చేసింది. కామెడీ, హారర్, ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో ఉత్కంఠను రేపేలా సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్యపాత్రల్లో కనిపించగా,  వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఇంప్రెస్ చేస్తోంది. మే 9న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.