మధ్యప్రదేశ్లో భారీ రైలు ప్రమాదం తప్పింది. గ్వాలియర్ సమీపంలో రైలు పట్టాలపై ఇనుప ఫ్రేమ్ ను పెట్టారు దుండగులు. గూడ్స్ రైలు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంగ ళవారం(అక్టోబర్ 09) తెల్లవారుజామున 4.30 గటలకుఝాన్సీ నుంచి ఆగ్రాకు వెళ్తున్న గూడ్స్ రైలు డ్రైవర్ బిర్లానగర్ స్టేషన్ సమీపంలో ట్రాక్ పై ఇనుప ఫ్రేమ్ ను చూసి రైల్వే అధికారులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు..ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇనుప ఫ్రేమ్ స్వాధీనం చేసుకున్నారు.
రైల్వే చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. అంతకుముందు అక్టోబర్ 6న రఘురాజ్ సింగ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై మట్టి కుప్పలు పోయడాన్ని లోకో పైలట్ చూసి వెంటనే రైలు నిలిపివేయడంతో ప్యాసింజర్ రైలుకు ప్రమాదం తప్పింది. ట్రాక్ పై మట్టిని తొలగించి రైలు రాకపోకలను పునరుద్దరించారు.