ఏపీలో తప్పిన రైలు ప్రమాదం

ఏపీలో తప్పిన రైలు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లో సత్యసాయి జిల్లా కదిరి రైల్వే గేట్ దగ్గర రైలు ప్రమాదం తప్పింది. నాగర్ కోయిల్ - ముంబై రైలు వచ్చే సమయంలో  కూటగుల్ల దగ్గర  గేట్ మెన్ గేట్ వేయలేదు.   వాహనాలు గేట్ దాటుతుండగా గమనించిన లోకో పైలెట్ సడెన్ బ్రేక్ వేశాడు.  దీంతో రైలు గేట్ దాకా రాకముందే ఆగిపోయింది.  ఒక్కసారిగా వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.  లేకపోతే మరో ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు.  గేట్ మేన్  నిర్లక్ష్యంపై అధికారులు విచారణ చేయగా చివరకు హాస్పటల్ కనిపించాడు. తనకు యాక్సిడెంట్ అయ్యిందంటూ బుకాయించాడు.

అటు ఒడిశాలో జూన్ 2న  జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 261 మంది చనిపోయారు. 900 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రదాని మోడీ కాసేపట్లో ఒడిశాలోని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు.