
గేదెను ఢీ కొనడంతో ఓ రైలు దాదాపు గంట పట్టాల మీద ఆగిపోయింది. ఈ సంఘటన జులై 12వ తేదీ బుధవారం మెదక్ జిల్లాలో జరిగింది. ఓ గూడ్స్ రైలు నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న క్రమంలో తూప్రాన్ మండలం నాగుల పల్లి వద్ద ఓ గేదె పట్టాల మీదకు రావడంతో రైలు దానిని ఢీ కొట్టింది. అయితే ఆ గేదె రైలు ఇంజన్ కింద ఇరుక్కుపోయి రైలు అక్కడే ఆగిపోయింది. ఈ ఘటనలో గేదె మృతి చెందింది. గూడ్స్ రైలు పట్టాలపైనే ఆగిపోవడంతో ఇతర రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చివరకు రైల్‌లోకో పైలట్, ఇతర సిబ్బంది ఇరుక్కుని చనిపోయిన గేదెను తొలగించడంతో రైలు బయలుదేరింది.
ALSOREAD :కత్తులతో బెదిరించి.. వలస కూలీల నుంచి డబ్బులు వసూలు చేసిండ్రు