దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!

దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!

రైళ్లలో అందించే ఫుడ్ క్వాలిటీపై ప్రయాణికుల నుంచి ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలే తరచూ పునరావృతం అవుతూ ఉన్నాయి. .. పాచిపోయిన, పురుగులు పడిన ఆహారం వచ్చిందంటూ ప్రయాణికుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడి ఫుడ్‌ ప్యాకెట్‌లో క్రిములు  కనిపించాయి.  కాశీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు తన ఆహారంలో ఒక క్రిమిని కనుగొన్నాడు.

పర్వేజ్ హష్మీ అనే వ్యక్తి ముంబైలోని గోరఖ్‌పూర్ మరియు లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ మధ్య నడిచే రైలు నంబర్ 15018 ట్రైన్​ లో ప్రయాణించాడు,  ప్రయాణ సమయంలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకున్నాడు. కాసేపటికి ఫుడ్‌ ప్యాకెట్‌ వచ్చింది. అయితే, అది తెరిచి స్పూన్​ తో అటూ.. ఇటూ కదుపుతుంటే క్రిములు కనిపించాయి  ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌ అయిన అతడు.. వెంటనే ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో('X ట్విట్టర్​) పోస్టు చేశాడు. తన ఫుడ్‌లో క్రిములు  వచ్చాయని    రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేశాడు.. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఈ వైరల్​ ట్వీట్​ పై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు,  వెజ్​ ధరకే చైనీస్​ థాలీ వచ్చిందని ఒకరు పోస్ట్​ చేసి.. రైల్వే శాఖ ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్​ చేయవచ్చని కామెంట్​ చేశారు.  మరొకరు ఆహారం అడిగినప్పుడు కీటకాలు.. క్రిములు.. జంతువులు వద్దని స్పష్టంగా రైల్వేలోని క్యాంటిన్​ వారికి చెప్పాలన్నారు.  ఇంకొకరు మాత్రం రైల్వే క్యాంటిన్​లో అదనపు ప్రోటీన్​ లను ఫుడ్​ తో ఫ్రీగా ఇస్తారని మీకు తెలియదా అని రాశారు. 

IRCTC విక్రేతల ద్వారా ఆన్‌లైన్‌లో భోజనాన్ని ఆర్డర్ చేయడంతో, ప్రయాణీకుడు అసంతృప్తిని వ్యక్తం చేశాడు, రైల్వే అధికారులను ట్వీట్‌లో ట్యాగ్ చేశాడు. రైల్ సేవా సోషల్ మీడియా పోస్ట్‌ను అంగీకరించినప్పటికీ, ఈ సంఘటనపై ప్రతిస్పందనగా తీసుకున్న చర్యలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై స్పందించిన రైల్వేశాఖ PNR వివరాలు, ప్రయాణికుని పేరు ఫోన్​ నెంబరుతో రైల్వే శాఖ సహాయం కోసం  డైరెక్ట్ మెసేజ్ (DM) ద్వారా ఫిర్యాదు చేయాలని ఫిర్యాదు దారునికి రైల్వే అధికారులు సూచించారు.