హైదరాబాద్ విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు స్టార్ట్

 హైదరాబాద్  విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు స్టార్ట్

హైదరాబాద్, విజయవాడ మధ్య తిరిగి రైళ్ల రాకపోకలు షూరు అయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో వరదకు  కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో అధికారులు రైలు సర్వీసులను పునరుద్ధరించారు. విజయవాడ నుండి వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రైళ్లను ప్రారంభించారు. ట్రయల్ రన్‎గా మొదట విజయవాడ నుండి గోల్కొండ ఎక్స్ ప్రెస్‎ను అధికారులు పంపారు. ఈ ట్రైన్ గుంటూరు, విజయవాడ, వరంగల్  మీదుగా హైదరాబాద్‎కు చేరుకోనుంది. 

కాగా, మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో వరదకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో తెలంగాణ, ఏపీ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దక్షిణ మధ్య రైల్వే అధికారులు యుద్ధ ప్రాతి పదికన ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. మూడు రోజుల పాటు పగలు రాత్రి శ్రమించి ట్రాక్‎ను పునరుద్ధరించారు.

Also Read:-శ్రీరాంసాగర్ కు భారీ వరద.. 41గేట్ల ఎత్తివేత..

 మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో  కొబ్బరికాయ కొట్టి ఇవాళ (సెప్టెంబర్ 4) అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఇవాళ (బుధవారం) సాయంత్రం నుండి పూర్తిస్థాయిలో యధావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగించేందుకు అవకాశం ఉంది. కాకపోతే, ప్రమాదం జరిగిన చోట రైళ్ల వేగం తగ్గించనున్నట్లు సమాచారం. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రైళ్లు తిరిగి మళ్లీ పరుగులు పెట్టనున్నాయి.