రైలు సేవలను నిలిపివేసే ఆలోచనలేదు

రైలు సేవలను నిలిపివేసే ఆలోచనలేదు

దేశంలో కరోనా మళ్లీ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ భయాలతో వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో చాలా రాష్ట్రాల్లో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీనిపై స్పందించిన రైల్వే బోర్డు ఛైర్మన్‌ సునీత్‌ శర్మ.. రైలు సేవలను నిలిపివేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అవసరమైతే డిమాండ్‌ను బట్టి మరిన్ని రైళ్లను పెంచుతామని హామీ ఇచ్చారు. 

వేసవి సీజన్‌లో రైళ్లలో రద్దీ కామన్ అన్న సునీత్ శర్మ.. ప్రస్తుతం రైళ్ల కొరత లేదన్నారు. ఒకవేళ ప్రయాణికుల రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా రైళ్ల సేవలను కూడా పెంచుతామని స్పష్టం చేశారు. మరోవైపు  రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుంచి  కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ అడుగుతున్నారనే వార్తలు నిజం కాదన్నారు.