![సంక్రాంతికి రైళ్లు ఫుల్.. 4 నెలల ముందే బుక్ అయిన టికెట్లు](https://static.v6velugu.com/uploads/2024/09/train-tickets-are--sold-out--4-months-before-sankranti-festival_GkX2qeMjRa.jpg)
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. పండుగకు 4 నెలల ముందే టికెట్స్ అన్నీ బుక్ అయ్యాయి. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే స్థిరపడిన వారు ఏటా సంక్రాంతి పండుగకు రైళ్లలో సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈసారి 4 నెలల ముందే ప్రయాణికులు ట్రైన్ టికెట్లను బుక్ చేసుకున్నారు.
దసరా పండుగ రాకముందే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రైళ్లలో సంక్రాంతికి రిజర్వేషన్ సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 11న హైదరాబాద్ నుంచి వెళ్లే విశాఖ, గోదావరి, ఫలక్నామా, కోణార్క్ తదితర రైళ్లకు శుక్రవారం ఉదయం 8 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభం కాగా, ఐదు నిమిషాల్లోనే బెర్తులు నిండిపోయాయి. సంక్రాంతికి 4 నెలల ముందే రిజర్వేషన్లు నిండిపోవడం ఇదే తొలిసారని రైల్వే అధికారులు ‘వెలుగు’కు తెలిపారు.