రష్యాలో రైలు ప్రమాదం.. 140 మందికి గాయాలు

రష్యాలో రైలు ప్రమాదం.. 140 మందికి గాయాలు

సోమవారం(జులై 29) దక్షిణ రష్యాలో  800 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు లెవెల్ క్రాసింగ్‌లో ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో పలు రైలు క్యారేజీలు(భోగీలు) చెల్లాచెదురుగా పడగా.. దాదాపు 140 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 

ఈ రైలు టాటర్‌స్థాన్‌లోని కజాన్ నుండి నల్ల సముద్రం మీదుగా అడ్లెర్‌కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మాస్కోకు దక్షిణంగా 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొటెల్నికోవో స్టేషన్ సమీపంలోని దక్షిణ వోల్గోగ్రాడ్ ప్రాంతంలో పట్టాలు తప్పిందని అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. రైలు డ్రైవర్, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి క్రాసింగ్‌లోకి ప్రవేశించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు రష్యన్ రైల్వే తెలిపింది.

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారని, అయితే రష్యా అధికారులు దానిని ధృవీకరించలేదన్న మాటలు వినపడుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పట్టాలు తప్పిన క్యారేజీలలోని ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది.