మెడిసిన్ సప్లై లో రోగులకు ఇబ్బంది కలగొద్దు : మృనాల్ శ్రేష్ఠ

  •  ట్రైనీ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ

ఖమ్మం టౌన్, వెలుగు : మందుల నిల్వలు, సరఫరా ఈ ఔషధీ పోర్టల్ లో అప్ డేట్ చేసి రోగులకు ఇబ్బంది లేకుండా  చూడాలని ట్రైనీ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ అన్నారు.శుక్రవారం ఐడీవోసీలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఫార్మాసిస్టుల వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్​వో బి.కళావతి బాయి, డీసీహెచ్ ఎస్ డాక్టర్ ఎస్.రాజశేఖర్ గౌడ్, డాక్టర్లు సైదులు, చంద్ నాయక్, వెంకట రమణ పాల్గొన్నారు.