అలంపూర్,వెలుగు: తెలంగాణకు వచ్చిన 2023 బ్యాచ్ కు చెందిన ట్రైనీ కలెక్టర్లు ఉమా హారతి, అజ్మీర సంకేత్ కుమార్, గరిమ నరుల, అభిగ్యాన్ మాల్వియా, అజయ్ యాదవ్ , మృనాల్ శ్రేష్ట, మనోజ్ గురువారం తెలంగాణ దర్శన్ లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాను సందర్శించారు. స్వామివారి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి కలెక్టర్ బీఎం సంతోష్ తో కలిసి జిల్లాలో అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో చేనేత కార్మికులను కలిసి చేనేత మగ్గాలు, వస్త్రాల తయారీ విధానాన్ని పరిశీలించారు.