
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్ అండ్ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా 517 ట్రైనీ ఇంజినీర్ నియామకానికి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత : బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 55% మార్కులు అవసరం. బీటెక్ అభ్యర్థులకు 28 ఏళ్లు. ఎంటెక్ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు. జీతం నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మార్చి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.bel-india.in వెబ్సైట్లో సంప్రదించాలి.