గోదావరిఖని, వెలుగు: ఇండస్ట్రీయల్ టూర్లో భాగంగా రామగుండం ఏరియాలోని ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ ప్లాంట్లను శుక్రవారం 2022-–23 బ్యాచ్ చెందిన ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్లు సందర్శించారు. ఆర్ఎఫ్సీఎల్లో యూరియా, ఎన్టీపీసీలో విద్యుత్‌ఉత్పత్తి ఎలా జరుగుతోందని తెలుసుకున్నారు.
పలు అంశాలపై వీరికి స్థానిక సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌస్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు కోయ శ్రీహర్ష, కుమార్‌దీపక్ అవగాహన కల్పించారు. అంతకుముందు కలెక్టర్ శ్రీ హర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్‌ను ఆఫీసుల్లో మర్యాద పూర్వకంగా కలిశారు.