జీహెచ్ఎంసీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్​లు

జీహెచ్ఎంసీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్​లు

హైదరాబాద్, వెలుగు: సిటీలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన ట్రైనీ ఐఏఎస్ లు శనివారం జీహెచ్ఎంసీని సందర్శించారు. బుద్ధ భవన్ మీటింగ్ హాల్ లో కమిషనర్ రోనాల్డ్ రోస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాలను వివరించారు. పర్యటనలో భాగంగా దుండిగల్, జవహర్ నగర్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్, టీ-హబ్, ఇండస్ట్రీయల్ పార్క్ ను సందర్శించనున్నారు.