బోధన్, వెలుగు : బోధన్మండలంలోని ఏరాజ్పల్లి గ్రామాన్ని ట్రైనీ ఐఏఎస్ కిర్మాయి సందర్శించారు. గ్రామంలోని పల్లెప్రగతి పనులను పరిశీలించారు. నర్సరీని విజిట్చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో కొనసాగుతున్న పనులపై డీపీవో తరుణ్ కుమార్ఆమెకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు ముందస్తుగా వాటిని నర్సరీల్లో పెంచుతున్నామని
మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజూ నీటిని అందిస్తున్నామన్నారు. గ్రామంలో కొనసాగుతున్న పనులను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ సిబ్బందిని అభినందించారు. ఆమె వెంట డీఎల్పీవో సాయిబాబా, ఎంపీడీవో వెంకటేశ్ జాదవ్, ఎంపీవో మధుకర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, సిబ్బంది, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.