కోలోకతాలో ట్రైనీ డాక్టర్ ​లైంగకదాడికి నిరసిస్తూ.. ఓపీ సేవలు బంద్​

  • రాష్ట్రవ్యాప్తంగా  బంద్ కు పిలుపునిచ్చిన జూడాలు 

  • అత్యవసర సేవలకు మినహాయింపు 

  • సంఘీభావం ప్రకటించిన సీతక్క 

హైదరాబాద్:  కోల్​కతాలో ట్రైనీ డాక్టర్​ లైంగికదాడి, హత్యను నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఓపీ సేవల బంద్​కు జూడాలు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్​ డాక్టర్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి జూడాలు నోటీసులు అందించారు. ఈ క్రమంలో గవర్నమెంట్​ హాస్పిటల్​లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రత్నామ్నాయ ఏర్పాట్లను చేసి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సేవలకు మాత్రం డాక్టర్లు మినహాయింపు ఇచ్చారు.  

ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి ఘటనలు రిఫిట్​ కాకుండా ప్రభుత్వం చూడాలన్నారు.  గాంధీ హాస్పిటల్​కు రోగిని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్క గాంధీ హాస్పిటల్​కు వచ్చారు. ఈ క్రమంలో గాంధీలో నిరసన చేపట్టిన డాక్టర్లకు మంత్రి సంఘీభావం ప్రకటించారు. కోలకతాలో డాక్టర్​పై లైంగికదాడి, హత్య చేయడం దారుణమన్నారు.  ఈ ఘటనపై  కేంద్రం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించాలన్నారు.