
జన్నారం, వెలుగు: కాళేశ్వరం, బాసర జోన్ల కు చెందిన 55 మంది ట్రైయినీ ఎస్ఐలు శుక్రవారం జన్నారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. శిక్షణలో భాగంగా గుడిపేటలోని 13 బెటాలియన్ లో నెల రోజుల పాటు విధుల నిర్వహణ, ఫిజికల్ శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా గుడిపేట 13 బెటాలియన్ కమాండెంట్ వెంకటరాములు, బెటాలియన్ ఎఎస్ఐ శ్రీనివాస్ అధ్వర్యంలో జన్నారం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్ లో అవుట్ పోస్టు, రికార్డుల నిర్వహణ, గార్డు డ్యూటీ తదితర అంశాలపై జన్నారం ఎస్ఐ రాజావర్దన్ వారికి వివరించారు. 55 మంది ట్రైయినీ ఎస్‌ఐలలో 18 మంది మహిళ ఎస్ఐలుండగా 37 మంది పురుషులున్నారు.