పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అనుకునే వారికి మంచి అవకాశం వచ్చింది. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) సంస్థ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గురుగ్రామ్‌లోని మహారత్న కంపెనీలో 70 ట్రైనీ సుపర్ వైజర్ పోస్టులు పోస్టులను ఫిల్ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా ఈక్వలెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. powergrid.in అఫీషియల్ వెబ్ సైట్ లో నవంబర్ 6లోగా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు ఆప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు అయితే వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 2024 నవంబర్ 6 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. రిజర్వుడ్ అభ్యర్థులకు ఏజ్ రిలాస్కేషన్ ఉంది. 

ట్రైనీ సుపర్ వైజర్ పోస్టులకు రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు. జాబ్ కు సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.24,000 సాలరీ ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ త్వరలోనే ప్రకటిస్తారు. 

పోస్టుల వివరాలు :

జనరల్-30, EWS క్యాటగిరి 07, OBC18, ఎస్సీ-10, ఎస్టీ-05లకు పోస్టులు కేటాయించారు. మొత్తం ఖాళీల్లో దివ్యాంగులకు 3 పోస్టులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ బోర్డ్ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. డిప్లొమాతో బీటెక్ లేదా ఎంటెక్, బీఈ, ఎంఈ కలిగి ఉండాలి. డిప్లొమాలో  జనరల్, ఓబీసీ(ఎన్‌సీఎల్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 70 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాస్ అయితే చాలు.

 పరీక్ష విధానం :

మొత్తం 170 మార్కులకు రిటన్ టెస్ట్ ఉంటుంది. పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో 170 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-1లో 120 మార్కులకు టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, పార్ట్-2లో 50 మార్కులకు ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్క్ కలిగి ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్ కు 0.25 మార్కులు నెగిటివ్ మార్కులు ఉంటాయి. నాగ్‌పుర్, భోపాల్‌, బెంగళూరు, చెన్నైల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి.