లాభసాటి అయిన రంగాల్లో పౌల్ట్రీ పరిశ్రమ ఒకటి. సరైన మెళుకువలు పాటించి ఈ బిజినెస్ చేస్తే అధిక లాభాలు పొందొచ్చు. ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కోళ్ల పెంపకంపై ఆసక్తి కలిగినవారికి ఇంటివద్ద ఉండే శిక్షణ తీసుకునే వేఅసలుబాటు కల్పించింది. ఇందుకు చేయాల్సిందల్లా అఫీషియల్ వెబ్సైట్ కి లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని ఫీజు చెల్లించటమే.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
ముందుగా https://forms.gle/CLFs35a7byWVDpWr9 ఈ లింక్ మీద క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
రిజిస్ట్రేషన్ పేజీ లో డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత నిర్దేశించిన మొత్తం ఫీజ్ చెల్లించాలి.
ఫీజ్ ఎంత, ఎలా చెల్లించాలి:
ఈ కోసం ప్రభుత్వం ఫీజు 6000గా నిర్ణయించింది.
ఒకవేళ ఆన్లైన్ ద్వారా ఫీజ్ చెల్లిస్తే 5000మాత్రమే చెల్లించాలి.
ఎస్బీఐ పేమెంట్ గేట్ వే ద్వారా ఈ ఫీజ్ చెల్లించబడుతుంది.
ఆన్లైన్లో ఫీజ్ చెల్లించిన వారు ట్రాంజాక్షన్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోవాలి.
డీడీ ద్వారా ఫీజ్ చెల్లించేవారు డీడీ రశీదును చాట చేయాలి.
ఏ కారణం చేతనైన కోర్స్ కొనసాగించలేకపోతే ఫీజ్ వాపసు ఇవ్వబడదు.
తప్పక ఉండాల్సినవి:
విండోస్ 07 లేదా అంతకంటే అప్డేటెడ్ వర్షన్ ఓఎస్, వెబ్ క్యం ఉన్న కంప్యూటర్, లాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి.
సరిపడా ఇంటర్నెట్ డేటా ఉండేలా చూసుకోవాలి.
వీటన్నిటితో పాటు ఈ కోర్స్ కి అప్లై చేయటం కోసం గూగుల్ అకౌంట్ తప్పనిసరి.