చట్టాలపై పోలీసులకు శిక్షణ తరగతులు

చట్టాలపై పోలీసులకు శిక్షణ తరగతులు

బోధన్​,వెలుగు : బోధన్​ పట్టణంలోని కోర్టు ఆవరణలో పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులు  రాష్ట్ర డైరెక్టర్​ ఆఫ్​ ప్రాసిక్యూషన్​ వైజయంతి, డిప్యూటీ డైరెక్టర్​ ఆఫ్​ ప్రాసిక్యూషన్​ లక్ష్మి నరసయ్య ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు అడిషనల్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ డాక్టర్​ సమ్మయ్య తెలిపారు. పోలీసులకు భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్షణ సంహిత 2023

 భారతీయ సాక్ష్య అధినియం న్యాయం 2023 చట్టాలపై  అడిషనల్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్లు డాక్టర్​ సమయ్య, శ్యామ్​ రావ్​, అసిస్టెంట్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ చిదిరాల రాణి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రుద్రూర్​ సీఐ జయేశ్ రెడ్డి,  వర్ని ఫారెస్ట్​ రేంజ్​ ఆఫీసర్​ పి.పద్మరావు, ఎస్సైజ్​ సీఐ   బి.పవన్​ గౌడ్​, బోధన్​, కోటగిరి, రుద్రూర్​ ఎస్సైలు రామారావు, సందీప్​,  అప్పారావు,  పోలీసులు  పాల్గొన్నారు.