హార్వెస్ట్ స్కూల్ లో టీచర్లకు ట్రైనింగ్ క్లాస్‌లు

హార్వెస్ట్ స్కూల్ లో టీచర్లకు ట్రైనింగ్ క్లాస్‌లు

ఖమ్మం టౌన్, వెలుగు :   తెలంగాణలోని 14 సెంట్రల్​ స్కూళ్ల టీచర్లకు సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెంకడరీ ఎడ్యూకేషన్​(సీబీఎస్ఈ) ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ ఇస్తున్నారు. ఖమ్మంలోని హార్వెస్ట్​ పబ్లిక్​ స్కూల్​లో నిర్వహించే ట్రైనింగ్​ను శుక్రవారం హార్వెస్ట్​ విద్యా సంస్థల ప్రిన్సిపాల్​ పార్వంతి ప్రారంభించారు. 

సీబీఎస్​ఈ ఎంపిక చేసిన రిసోర్స్​ పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నారు. సీబీఎస్ఈ రిసోర్స్ పర్సన్స్ గా ఎంపికైన డిప్యూటీ డైరెక్టర్ జితేందర్ భట్టి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ మేనేజ్​మెంట్​ఆర్.ప్రసన్న కుమార్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ మేనేజ్​మెంట్ ఇన్ గవర్నమెంట్ త్రివేండ్రం నుంచి సునీర్ నాగి,హైదరాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పల్లవి ఈ ట్రైనింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.