- రెస్క్యూ నిర్వహణపై డెమో
భద్రాచలం,వెలుగు : భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన 35 మంది ఫైర్ స్టాఫ్‌కు గురువారం ట్రైనింగ్ నిర్వహించారు. కొత్తగా కొనుగోలు చేసిన రిమోట్ కంట్రోల్ లైఫ్ సేవింగ్ బోట్ పై ట్రైనింగ్, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ క్రాంతి పర్యవేక్షణలో ముంబైకి చెందిన శ్రీలలిత కంపెనీ ప్రతినిధి మనోజ్ సావన్ ట్రైనింగ్ ఇచ్చారు.
ప్రకృతి విపత్తులు సంభవించినపుడు కీలకమైన ఫైర్ స్టాఫ్ అనుసరించాల్సిన విధానాలను భద్రాచలం ఫైర్ స్టేషన్లో వివరించి, రిమోట్ కంట్రోల్ లైఫ్ సేవింగ్ బోట్ ద్వారా రక్షించడంపై గోదావరిలో డెమో క్లాసులు ఇచ్చారు. భద్రాచలం, ఇల్లెందు ఫైర్ ఆఫీసర్లు శ్రీనివాస్, నవీన్‌కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.