
హనుమకొండ, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో హనుమకొండలోని జడ్పీ మీటింగ్ హాలులో ఎలక్షన్ సిబ్బందికి ట్రైనింగ్ నిర్వహించారు. ముందుగా పరిషత్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుండగా, బుధవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కు సం బంధించి రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు జడ్పీ డిప్యూటీ సీఈవో బి.రవి ఆధ్వర్యంలో ట్రైనిం గ్ ఇచ్చారు. హనుమకొండ రెవె న్యూ డివిజన్ పరిధిలోని 37 మం ది ఆర్వోలు, 37 మంది ఏఆర్వోలు, పరకాల పరిధిలోని 21 మంది ఆర్వోలు, 21 మంది ఏఆర్వోలు, జడ్పీటీసీ ఎలక్షన్ కు సంబంధించి 13 మంది ఆర్వోలు మొత్తంగా 129 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.